యేసు క్రీస్తు ఒక్కడే దేవుని చేరే మార్గము
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. (మత్తయి 7:13-14)
దేవుని గురించి బైబిల్ ఏమి చెప్తుంది?
మనలను మనము సృష్టించుకొనలేదు,మరియు మనకు మనమే జవాబుదారులము లేక స్వశక్థులము కాదు. దేవుని ఆరాధించుట కొరకు ఈ ప్రపంచము మరియు అందులో వున్న ప్రతిదీ, మానవునితో సహా దేవుడు సృష్టించారు. ఆయన మనలను సృష్టించాడు గనుక,మన జీవితము గురించి లెక్క చెప్పమని అడిగే సర్వ హక్కులు ఆయనకున్నవి.
దేవుడు సృష్టికర్త
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను [సృష్టించెను]. (ఆదికాండము 1:1)
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము. (కీర్తనలు 100:3)
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు [సృష్టింపబడెను], సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు [సృష్టింపబడెను]. (కొలొస్సయులకు 1:16)
దేవుడు పరిశుద్ధుడు
నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా;.. (హబక్కూకు 1:13)
వారుసైన్యముల కధిపతియగు యెహోవా(దేవుడు), పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. (యెషయా 6:3)
దేవుడు నీతిమంతుడు మరియు న్యాయమంతుడు
యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు. (కీర్తనలు 119:137)
న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. (కీర్తనలు 7:11)
యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. (కీర్తనలు 11:7)
మానవుడు దేవుని చేత సృష్టింపబడి మరియు ఆయనకు సొంతం గనుక, మనము ఆయనకు
వ్వవలసిన ఆ గౌరవం మరియు కీర్తి ఇవ్వవలెను. జీవించే విధానము, మాట్లాడే తీరు, పని చేసే విధానము మరియు ఆలోచన విధానము ఆయన అధికారం గుర్తించే విధంగా మసులుకోవడం మన బాధ్యత. మనలను పరిశుద్ధులుగా ఉండమని దేవుడు ఆజ్ఞాపించెను.
మానవుని గురించి బైబిల్ ఏమి చెప్తుంది?
దేవుని కీర్తించుటకు మరియు ఎప్పటికీ అతనితో ఆనందించడానికి మానవుని తన స్వరూపమందు సృష్టించెను.కాని మానవుడు తన అవిధేయత ద్వారా దేవునికి విరుద్ధముగా పాపము చేశను.అందువలన దేవుని యొక్క పవిత్రమైన మరియు సంతృప్తికరమైన సన్నిధి నుండి తనని తాను వేరుచెసుకొని దేవుని ఉగ్రతకు గురైయను.
ఆదాము మరియు హవ్వకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. (ఆదికాండము 2:17)
మానవుడు తన అవిధేయత ద్వారా దేవునికి విరుద్ధముగా పాపము చేసెను
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను; (ఆదికాండము 3:6)
మానవులందరిని పాపము అపవిత్రులుగా చేసెను
ఇట్లుండగా ఒక మనుష్యుని(ఆదాము)ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
(రోమా 5:12)
ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. (రోమా 3:10-12)
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
(రోమా 3:23)
దేవుడు నుండి మానవుడు వేరుచేయబడెను
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము. (రోమా 6:23)
..మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. (యెషయా 59:1-2)
మతం లేదా మంచి క్రియలు దేవుని ఉగ్రత నుండి మానవుని కాపాడలేవు
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. (రోమా 3:20)
మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డ[లు].. (యెషయా 64:6)
దేవుడు కేవలం పరిశుద్ధుడు, నీతిమంతుడు మరియు న్యాయమంతుడే కాక ప్రేమమయుడు కూడా.దేవుని ఎదుట అవినీతిమంతులైన మనము నీతిమంతులుగా లెక్కించేందుకు గాను, దోషికి బదులుగా నిర్దోషి అని ప్రకటించి మరియు శిక్షకు బదులు విముక్తి కలిగించేందుకు దేవుడు ఒకే ఒక్క మార్గమును ఎర్పరచెను.
పాపులను రక్షించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి?
మన పాపముల నిమిత్తము మనము ఆనుభవించవలిసిన శిక్షను(మరణం) ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మీద మనకు బదులుగా మరణించారు.ప్రభువైన యేసు క్రీస్తు మరణము ద్వారానే మన పాపక్షమాపణ మరియు దేవుని ఉగ్రత త్రుప్తిపరిచేందుకు దేవుడిచిన ఒకే ఒక్క మార్గము.
ప్రభువైన యేసు క్రీస్తు దేవుని వలె భూమి మీదకు వచ్చెను
ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; (కొలొస్సయులకు 2:9)
నేనును తండ్రియును(దేవుడు) ఏకమై యున్నామని వారితో చెప్పెను. (యోహాను 10:30)
ఆదియందు వాక్యముండెను(యేసు), వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
(యోహాను 1:1)
ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారియై మానవుని వలె భూమి మీదకు వచ్చెను
ఆ వాక్యము(యేసు) శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.(యోహాను 1:14)
మన ప్రధానయాజకుడు(యేసు)మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. (హెబ్రీయులకు 4:15)
ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వసించు వారికి, దేవుని ప్రేమ చూపేందుకు అయన శిలువ మీద మరణించెను
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. (రోమా 5:8)
మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన(యేసు)శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
(1 పేతురు 2:24)
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను(యేసు) మనకోసము [దేవుడు] పాపముగాచేసెను. (2 కొరింథీయులకు 5:21)
…ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో [బ్రదికింపబడెను] .. (1 పేతురు 3:18-19)
యేసు క్రీస్తు సమాధి నుండి లేవనెత్తబడి సజీవులై వున్నారు మరియు ఆయనను తిరస్కరించినవారికి తీర్పు తీర్చుటకు వచ్చును
…లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. (1 కొరింథీయులకు 15:3-4)
ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన [చేయును]..
(2 థెస్సలొనీకయులకు 1:7-8)
దేవుని చేరేందుకు యేసు క్రీస్తు ఒక్కడే మార్గము
యేసు[ఇట్లనెను] నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను 14:6)
ప్రభువైన యేసు క్రీస్తు గురించి కొన్ని వాస్థవాలు విశ్వసించడంతో సరిపోదు.సాతాను మరియు అతని సైన్యము సహితం ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడని విస్వసిస్థాయి, కానీ అవి యేసుని ప్రేమించవు మరియు ఆజ్ఞ పాటించవు.
దేవుని పిలుపుకు నీవు ఎలా స్పందించెదవు?
మనము పశ్చాత్తాపము మరియు విశ్వాసముతో ఈ సుభావర్తకు స్పందించాలని దేవుని ఆజ్ఞ. పాపమూ మరియు స్వశక్తి నుండి వెనుతిరిగి దేవుని వైపు తిరగమని, పాపక్షమాపణ కొరకు ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మీద తన రక్తము చిందించారని విశ్వసించండి.
పశ్చాత్తప పడమని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు
కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని [చెప్పెను].. (మార్కు 1:15)
ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:30)
మరియు ఆయన(యేసు)అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. (లూకా 9:23)
యేసు క్రీస్తును ప్రభువు మరియు రక్షకుడని నమ్మమని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు
అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. (రోమా 10:9)
కుమారుని(యేసు)యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును. (యోహాను 3:36)
నీవు యేసు క్రీస్తు మాటలను తిరస్కరిస్తే, నీవు దేవుని తిరస్కరించినట్లే
నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. (యోహాను 12:48)
నీ సంగతి ఏమిటి? నీవు పశ్చాత్తప పడి యేసుని విశ్వసిస్థావ?
యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. (యెషయా 55:6)