యేసు క్రీస్తు యొక్క సువార్త
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము . అపో. కార్యములు 4:12
దేవుని యొక్క స్వభావము:
దేవుని యొక్క పరిశుద్ధత:
నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా హబక్కూకు 1:13

మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
యెషయా 59:2
దేవుని యొక్క న్యాయము:
యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనలు 11:7
సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన  దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ పరచు కొనును. యెషయా 5:16
న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చునుఆయన ప్రతిదినము కోపపడు దేవుడు , ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు. కీర్తనలు 7:11-12
మానవుని యొక్క దుర్నీతి మరియు శిక్ష:

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. రోమీయులకు 3:23
మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను యెషయా 64:6
ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. గలతియులకు 3:10
గొప్ప అగమ్య గోచరం లేదా సందిగ్ధత:
దుష్టులును నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులును దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు. సామెతలు 17:14-15

ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టు నితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? ఆదికాండము 18:25
దేవుని కార్యాచరణ:
పరిశుద్ధ గ్రంధము, దేవుని యొక్క పరిశుద్ధత మరియు న్యాయము గురించి మాట్లాడుతూ,దేవుని యొక్క ప్రేమను దృవీకరిస్తూ ఉన్నది. ఆ ప్రేమలోనే దేవుడు మనిషి యొక్క దుర్దషకు ప్రత్యుతరము ఇచ్చియున్నాడు.

ప్రేమ నడిపింపు:
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు..మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. 1 యోహాను4:8-10
క్రీస్తు యొక్క సిలువ:
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. రోమీయులకు3:23-26
క్రీస్తు యొక్క పునరుత్థానము:
ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమీయులకు 4:25
మానవుని స్పందన:
మనము పాపము చేసియున్నాము అని దేవుడు చెప్పిన సత్యాన్ని గుర్తించి, ఒప్పుకొనడంతో మారుమనస్సు ఆరంభం అవుతుంది.

నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. . కీర్తనలు 51:3-4
మన పాపాన్ని, అపవిత్రతను మరియు నేరాన్ని స్వచ్చంగా గుర్తించినప్పుడు, మనము చేసిన కార్యముల గురించి స్వచ్చమైన దుఃఖము, అవమానము మరియు ద్వేషము కూడా కలుగుతుంది.
ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. రోమీయులకు 7:15
అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? రోమీయులకు 7:24
ప్రత్యక్షంగా పైకి కనిపించే, నిజాయితీ గల ఒప్పుకోలు ఒక్కటే , మారుమనస్సు పొందుకున్నాము అనడానికి రుజువు కాదు కాని, ఆ పాపం నుండి సంపూర్ణముగా మరలినప్పుడు మాత్రమే నిజమైన మారుమనస్సు పొందినట్టు.
మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి. యెషయా 1:16
ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి 3:10
విశ్వాస నిర్థారణ:
విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది. హెబ్రీయులకు11:1
దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. రోమీయులకు 4:21
దేవుని యొక్క వాగ్దానముల మీద విశ్వాసము:
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16
ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు అపో. కార్యములు 16:31
విశ్వాసి యొక్క సాక్ష్యము లేదా నిదర్శనము:
ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము ఫిలిప్పీయులకు3:3
నిజమైన రక్షణ యొక్క నిశ్చయత:
నిజమైన మార్పు:
నిజమైన క్రైస్తవుడు నూతన సృష్టి అయివున్నాడు, కావున దేవుని చేత చేయబడిన ఆ నూతనత్వాన్ని ప్రతిబింబించేలా జీవిస్తాడు.
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
2 కోరింథీయులకు 5: 17
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయు దురా?
మత్తయి 7:16
నిశ్చయత అనేది దేవుని యొక్క లేఖన వెలుగు లో మనలను పరీక్షించుకొనుట మీద ఆధారపడియున్నది.
మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా? 2 కోరింథీయులకు 13:5

దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 1 యోహాను 5:13
బైబిలుసంబంధమైన నిశ్చయత యొక్క పరిశోధన:
1 యోహాను 1:5-7 వెలుగులో నడచుట
1 యోహాను 1:8-10 పాపపు ఒప్పుకోలు
1 యోహాను 2:3-4 విధేయత
1 యోహాను 2:9-11 క్రైస్తవులకై ప్రేమ
1 యోహాను 2:15-17 లోక సంబందమైన వాటిపైన అయిష్టత
1 యోహాను 2:24-25 ఉపదేశము పట్ల ఓర్పు
1 యోహాను 3:10 నీతి
1 యోహాను 4:13 ఆత్మ సాక్ష్యము
హెబ్రీయులకు 12:5-8 దేవునిచేత శిక్షణ